ఎన్నికల్లో ఓడిపోవాలని అభ్యర్థి గుర్తుకు క్షుద్రపూజలు
TG: పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా గోళ్లపాడు గ్రామానికి చెందిన రవి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో రవి అంటే గిట్టని వ్యక్తులు బ్యాలెట్ పేపర్‌లో రవికి కేటాయించిన కత్తెర గుర్తుకు క్షుద్రపూజలు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.