మహిళా జాబ్ మేళాలో 64 మంది ఎంపిక
కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామచంద్రపురం టౌన్ హాల్‌లో నిర్వహించిన మహిళల జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు 64 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురుచూసే వారు రామచంద్రపురంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో తమ అప్లికేషన్ అందిస్తే వారి అర్హతను బట్టి అవకాశాలను తెలియజేస్తామని తెలిపారు.