చర్చి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: నందవరం మండలం హాలహర్వి గ్రామంలో నిర్మాణంలో ఉన్న చర్చిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ మేరకు చర్చి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చర్చి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.