సమానత్వం కోసం పోరాడిన వీరుడు బాబు జగ్జీవన్ రామ్
MBNR: సమానత్వం కోసం పోరాడిన వీరుడు బాబు జగ్జీవన్ రామ్ అని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండా సంతోష్ పాండురంగారెడ్డి రమేష్ పాల్గొన్నారు.