VIDEO: అక్రమ ఇసుక అడ్డుకున్న సర్పంచ్‌పై దాడి

VIDEO: అక్రమ ఇసుక అడ్డుకున్న సర్పంచ్‌పై దాడి

BDK: పాల్వంచ మండలం, నాగారం గ్రామంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో మహిళా సర్పంచ్ స్వప్నపై దాడి జరిగింది. ఆమెను నెట్టివేసి, భర్త వెంకటేష్‌పై ట్రాక్టర్ యజమాని దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.