శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు రాజ్ కిరణ్ తెలిపారు. స్వామివారికి ఉదయం అభిషేకము అర్చన మొదలగు కార్యక్రమాలు నిర్వహించి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.