యువతకు డ్రగ్స్‌పై అవగాహన
BPT: జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు వేటపాలెం మండలంలోని వివేరా బీచ్ పరిసరాల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చీరాల డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై జనార్ధన్, శక్తి టీం ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యాటకులకు శక్తి యాప్ వినియోగంపై వివరించారు.