గరివిడిలో పర్యటించిన మాజీ మంత్రి

VZM: మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గరివిడి మండలంలో ఆదివారం పర్యటించారు. మాజీ ఎంపీపీ కృష్ణంనాయుడు ఇటీవల గుండెపోటుకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న బొత్స, మాజీ ఎంపీపీ నివాసానికి వెళ్లి కృష్ణంనాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.