ఉప్పుగూడలో రోడ్డు మరమ్మతుల పనులు

HYD: ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి దేవాలయానికి వెళ్లే దారిలో, 09 జులై 2025 బుధవారం రోజు ఉదయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బోనాల పండుగకి నిధులు మంజూరు కావడం, మరోవైపు పండుగ సమీపిస్తుండడంతో, భక్తులకు అసౌకర్యం కలగకుండా, రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టారు. గుంతలలో వర్షపు నీరు నిలిచే చోట, తారుతో గుంతలను నింపి పూడ్చారు. డ్రైనేజీలను సరి చేశారు.