మరిన్ని ఎస్-400లు కొనుగోలు చేయనున్న భారత్!
రష్యా నుంచి మరిన్ని S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే S-400తో పాటు 60 మధ్యశ్రేణి రవాణ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ క్లియరెన్స్ ఇవ్వనుంది. కాగా, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ క్షిపణలు తమ భూభాగంపై దాడి చేయకుండా ఈ రక్షణ వ్యవస్థ వాటిని గగనతలంలోనే నాశనం చేసిన విషయం తెలిసిందే.