కొబ్బరికి డిమాండ్.. రైతుల హర్షం

కొబ్బరికి డిమాండ్.. రైతుల హర్షం

ELR: జిల్లాలో 35,238 ఎకరాల్లో కొబ్బరిని రైతులు సాగ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 100 కొబ్బరికాయల ధర రూ. 900 ఉండగా.. ప్రస్తుతం రూ. 2,500-రూ. 3,000 పలుకుతోందని కొబ్బరి రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో ఒక్కో కొబ్బరికాయ రూ. 20 నుంచి రూ. 30 వరకు విక్రయిస్తున్నారు. గత 6 నెలలతో పోలిస్తే ప్రస్తుతం దిగుబడి, గిట్టుబాటు బాగుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.