సహకార సంఘం ఉద్యోగులకు అండగా ఉంటుంది: ఇంఛార్జ్
KRNL: సహకార సంఘ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇంఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం స్థానిక ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు జరగాల్సిన న్యాయం కోసం, జీవో 36 ఉపసంహరణ నుంచి వేతనాల చెల్లింపు వరకు వైసీపీ మద్దతుగా నిలుస్తుందని రాజీవ్ రెడ్డి భరోసా ఇచ్చారు.