చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

SRCL: కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండాలో చిరుత దాడిలో ఓ లేక దూడ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం పరుశురాములు అనే రైతుకు చెందిన లేగ దూడపై చిరుత పులి దాడిలో మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. చిరుతపుడి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.