అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
VZM: సర్వజన ఆసుపత్రిలో 74 ఏళ్ల లక్ష్మీకాంతానికి క్లిష్టమైన తుంటి మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు. గతంలో కృత్రిమ తుంటి అమర్చుకున్న ఆమె ఇటీవల పడిపోవడంతో మళ్లీ ఎముక విరిగింది. ప్రొఫెసర్ లోక్నాథ్ బృందం పాత తుంటిని తొలగించి కొత్త తుంటిని అమర్చింది. ఫిజియోథెరపి తర్వాత ఆమె సాధారణంగా నడుస్తోందని సూపరింటెండెంట్ డా. అల్లు పద్మజ తెలిపారు.