ఉదయాన్నే పార్కులో కమిషనర్.. సమస్యలపై ఆరా

ఉదయాన్నే పార్కులో కమిషనర్.. సమస్యలపై ఆరా

BPT: బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి బుధవారం ఉదయం వివేకానంద కాలనీ పార్కును తనిఖీ చేశారు. వాకర్స్, వృద్ధులతో మాట్లాడి పార్కులో వసతులు, ఇబ్బందులపై ఆరా తీశారు. పెద్దలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉదయాన్నే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ, సమయానికి విధులకు హాజరవుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.