కాళ్లతో తొక్కుతూ రేషన్ బియ్యం పంపిణీ.. స్థానికులు ఆగ్రహం
HNK: పట్టణంలోని పద్మాక్షమ్మ కాలనీలోని రేషన్ షాపులో డీలర్ పేదలకు అందించే బియ్యాన్ని పాదాలతో తొక్కుతూ పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. ప్రజలు ఆక్షేపించగా “తీసుకుంటే తీసుకోండి.. లేకపోతే లేదు.. ఇలాగే ఇస్తా” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని తెలిపారు. ఈ అమానవీయ వ్యవహారం పై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.