క్యూ ఆర్ కోడ్‌తో గోల్కొండ చరిత్ర
HYD: ప్రపంచంలోనే పేరెన్నికగన్న చారిత్రక నిర్మాణంగా గోల్కొండ కోటను చెప్పవచ్చు. ఈ కోటను రోజూ వేల సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ కోట చరిత్రను తెలిపేలా పురావస్తు శాఖ అధికారులు ప్రతి నిర్మాణం వద్ద క్యూ ఆర్ కోడ్ స్కానర్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులు తమ ఫోన్లో దీనిని స్కాన్ చేస్తే నిర్మాణం చరిత్రతో పాటు దానికి సంబంధించిన చిత్రాలు ప్రత్యక్షమవుతాయన్నారు.