VIDEO: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వార్షిక తనిఖీల్లో భాగంగా కంభం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేసినట్లు తెలిపారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు, సీఐ మల్లికార్జున పాల్గొన్నారు.