రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం నుండి శివరాంపురం రోడ్డు వరకు MGNREGS నిధులు రూ.70లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ కార్యక్రమానికి హాజరై పనులను ప్రారంభించారు. గ్రామస్థాయిలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు.