'ఏఐతో కొత్త యుగం'.. సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు

'ఏఐతో కొత్త యుగం'.. సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచం తన హద్దులను వేగంగా విస్తరించుకునే కొత్త యుగంలోకి అడుగుపెట్టిందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ముంబైలో జరిగిన 'మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్'లో ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భారీ మార్పునకు, విస్తరణకు అత్యాధునిక కృత్రిమ మేధ(AI) ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. AIతో భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.