'దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తాం'
KMM: చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని శ్రీ గజగిరి లక్ష్మీనరసింహస్వామి, శ్రీ కోదండ రామాలయ దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సమత చేత ముత్తినేని వెంకటేశ్వర్లు ఛైర్మన్‌గా, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. నిరంతరం దేవస్థాన అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నూతన పాలకవర్గం సభ్యులు తెలిపారు.