VIDEO: CMRF చెక్కులు అందించిన ఎమ్మెల్యే పంచకర్ల
VSP: కూటమి ప్రభుత్వం ప్రజలు ఆరోగ్యానికి, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. నియోజకవర్గంకు చెందిన 14 మంది లబ్దిదారులకు రూ.11.80 లక్షలు CMRF చెక్కును ఎమ్మెల్యే ఆయన కార్యాలయంలో ఆదివారం అందించారు. నియోజకవర్గ ప్రజలు ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే CMRFకు అర్జీ పెట్టుకోవాలని సూచించారు.