స్వాతంత్య్ర దినోత్సవానికి అతిథిగా కోదండ రెడ్డి రాక

KMR: జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటలకు స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్కక్రమాలు నిర్వహించనున్నారు.