పెద్దఈటిపాకం వద్ద యువకుడు మృతి
TPT: జిల్లా సత్యవేడు మండలం పెద్దఈటిపాకం సమీపంలో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొనడంతో గుంతలో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటన రెండు రోజుల క్రితమే జరిగినట్టు తెలుస్తుండగా, పోలీసులు మృతుడి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.