గుడివాడలో విద్యుత్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
కృష్ణా: గుడివాడలో గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులపై విజిలెన్స్ ఈఈ వాసు, ఆపరేషన్ ఈఈ శ్రీనివాసరావు, 40 బృందాలు ఏర్పడి ఈ రోజు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 3,340 గృహ సర్వీసులు, 396 వాణిజ్య సర్వీసులను తనిఖీ చేయగా, వాటిలో 443 సర్వీసులకు అదనపు లోడ్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మొత్తం 643 కిలోవాట్ల అదనపు లోడ్‌కు వినియోగదారులపై ₹12,86,000/- జరిమానా విధించారు.