కన్నుల పండువగా అయ్యప్పస్వామి పడి పూజ

కృష్ణా: మండవల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి కన్నుల పండువగా శ్రీ అయ్యప్పస్వామి పడి పూజ చేశారు. వివేకానంద గురుస్వామి ఆధ్వర్యంలో పద్దెనిమిది కలశాలతో పద్దెనిమిది మెట్ల పూజ నిర్వహించారు. అయ్యప్పస్వామికి పూలా అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వాములు, చలపతి, గంగారాజు, శ్రీను, చంటి, అప్పారావు శిష్య బృందం పాల్గొన్నారు.