విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
KKD: సామర్లకోట కోట బజార్‌కు చెందిన మోర్త శీను (40) శుక్రవారం ఉదయం జగన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని నీళ్లతో తడుపుతూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. బంధువులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిని ధృవీకరించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.