మోదీ డిగ్రీ వివాదం.. హైకోర్టుకు కీలక ఆదేశాలు
ప్రధాని మోదీ డిగ్రీ వివాదం వేళ ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిగ్రీ వివరాలను వెల్లడించే అంశంలో స్పందించాలని ఢిల్లీ వర్సిటీని ఆదేశించింది. ఈ కేసులో తన అభ్యంతరాలను దాఖలు చేసేందుకు వర్సిటీకి మూడు వారాల సమయం ఇస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు తదుపరి విచారణను 2026 జనవరి 16కు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది.