బండారులంక ప్రత్యేక అధికారిగా తహసీల్దార్
కోనసీమ: అమలాపురం మండలం బండారులంక గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా అమలాపురం తహసీల్దార్ వాసా సామ్యూల్ దివాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఆయనకు సచివాలయ సిబ్బంది, కూటమి నేతలు స్వాగతం పలికారు.