'మార్కెట్ కమిటీని అభివృద్ధి దిశలో నడిపించాలి'

TPT: నూతనంగా ఎంపికైన మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు, సభ్యులు మార్కెట్ కమిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి నాయకులు, జనసేన సభ్యులందరినీ అభినందించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు, రైతులకు మరింతగా సేవలు చేసేందుకు చక్కటి అవకాశంగా భావిస్తున్నామన్నారు. తిరుపతిలో జరిగిన దళిత యువకుడు దాడిని రాష్ట్రమంతా ఖండించాలన్నారు.