ఆటోలో మర్చిపోయిన 6 తులాల బంగారం రికవరీ
VSP: ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ద్వారక బస్టాప్ వరకు ఆటోలో ప్రయాణించిన రాజాంకు చెందిన ప్రసాద్, తన సూట్‌కేస్‌ను అందులోనే మర్చిపోయారు. అందులో సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ద్వారక క్రైమ్ పోలీసులు, సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి గంటల వ్యవధిలోనే సొత్తును బాధితుడికి అప్పగించారు.