మల్లన్న అన్న ప్రసాద పథకానికి రూ. 1 లక్ష విరాళం

మల్లన్న అన్న ప్రసాద పథకానికి రూ. 1 లక్ష విరాళం

NDL: శ్రీశైలం మహా క్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద పథకానికి కడప పట్టణానికి చెందిన అప్ప రమేశ్ బాబు, కుటుంబ సభ్యులు గురువారం రూ. 1 లక్ష విరాళం అందించారు. ఈ మేరకు వారు దేవస్థానం అన్నప్రసాద విభాగం కార్యాలయానికి చేరుకుని సహాయ కార్యనిర్వహణాధికారిని కలిసి విరాళం అందజేశారు. విరాళం చెల్లించిన దాతలకు స్వామి వారి ప్రసాదాలు అందించి సన్మానించారు.