'శ్రీ రంగనాథుడికి ప్రత్యేక పూజలు'

KRNL: మద్దికేర మండలం పెరవలి గ్రామంలో శ్రీరంగనాథ స్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి కుంకుమార్చన, సేవ కార్యక్రమాలు జరిపించారు. భక్తుల కోసం మాజీ సర్పంచ్ సీతారాం రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు.