సెప్టిక్ ట్యాంక్ ఆక్రమణలను తొలగించిన హైడ్రా
MDCL: కూకట్‌పల్లి జోన్ ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని శిల్పా బృందావన్ కాలనీలో సెప్టిక్ ట్యాంక్, ఖాళీ స్థలాల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. నివాసితుల ఫిర్యాదుతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో తనిఖీ చేసి 20 గుంటల ఆక్రమణను గుర్తించింది. అనుమతి లేని లే ఔట్ చుట్టూ ఫెన్సింగ్ వేసి, దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది.