చిన్నారిపై వీధి కుక్కల దాడి
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణ ఘటన శుక్రవారం రోజున చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కులు దాడి చేసి, తన చెవిని కొరుక్కుతిన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.