VIDEO: ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
MHBD: గూడూరు మండలం పొనుగోడులో పాత ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 6 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు బియ్యాన్ని నిల్వ చేసినట్లు గుర్తించామని సీఐ వినయ్ కుమార్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.