'లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి'

'లోక్ అదాలత్‌లను  సద్వినియోగం చేసుకోవాలి'

MBNR: లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కోర్టు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదీన జిల్లా కోర్టు కార్యాలయంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు.