గడసింగుపురంలో వైద్య శిబిరం

గడసింగుపురంలో వైద్య శిబిరం

PPM: జియ్యమ్మవలస మండల పరిధిలోని గడసింగిపురం గ్రామంలో సోమవారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జగదీష్ తెలిపారు. కొద్ధిరోజుల క్రితం గడసింగుపురంలో కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఈ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.