అదనపు భవనాన్ని ప్రారంభించిన చైర్మన్

KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో అదనపు భవనాన్ని మంగళవారం చైర్మన్ దివిటి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సౌకర్యం కోసం రూ 20 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అరుణ్, కార్యదర్శి గంగాధర్, ఏఈఓ జ్ఞానేశ్వర్, డీసీసీబీ మేనేజర్ సందీప్ పాల్గొన్నారు.