గిద్దలూరులో 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం

గిద్దలూరులో 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో శనివారం కమిషనర్ రమణ బాబు ఆధ్వర్యంలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, హరితంగా మార్చడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు.