ఏపీ ఐసెటికి 90.83% హాజరు నమోదు

ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 90.83% హాజరు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి రెండు సెషన్లుగా జరిగిన ఈ పరీక్షకు 37,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 3,441 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌కి 90.15% మంది హాజరవగా, మధ్యాహ్నం సెషన్‌కి 91.52% మంది హాజరయ్యారు.