'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

BDK: అశ్వాపురం మండలంలోని నెల్లిపాక పంచాయితీలో తహశీల్దార్ మణిధర్ గురువారం గోదావరి వరదల ప్రభావాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ.. ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి భారీగా వరదనీరు వస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరదనీరు పెరుగుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.