స్వచ్ఛ బెల్లంపల్లికి ప్రజలందరూ సహకరించాలి: కమిషనర్

స్వచ్ఛ బెల్లంపల్లికి ప్రజలందరూ సహకరించాలి: కమిషనర్

MNCL: బెల్లంపల్లి 28వ వార్డ్ కౌన్సిలర్ చిప్ప అర్చన ఆధ్వర్యంలో వార్డ్ ప్రజలు శనివారం శ్రమదానం చేశారు. వార్డ్‌లో సింగరేణి క్వార్టర్స్ వెనుకాల ఎన్నో ఏళ్లుగా చెత్తచెదారంతో నిండిపోయిన ప్రాంతాన్ని కౌన్సిలర్, ప్రజలు కలిసి శుభ్రం చేశారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ వార్డ్ ను సందర్శించి వార్డ్ ప్రజలను అభినందించారు. స్వచ్ఛ బెల్లంపల్లికి అందరు సహకరించాలని సూచించారు.