రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

PDPL: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష, డీసీపీ కరుణాకర్‌తో కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమీక్ష జరిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.