నియోనాటల్ 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ
JGL: జిల్లా కేంద్రంలోని నియోనాటల్ 108 అంబులెన్స్‌ను శనివారం 108 జిల్లా మేనేజర్ ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. నవజాత శిశువులకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే నియోనాటల్ ఇంకూబేటర్, వెంటిలేటర్, సక్షన్ ఆపరేటర్, మల్టీఛానల్ మానిటర్, AEDతో పాటు ఇతర వైద్య పరికరాల పని తీరు, ఆక్సిజన్, మందులను, పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.