తాకట్టు పెట్టిన నగలతో వ్యాపారి పరార్

తాకట్టు పెట్టిన నగలతో వ్యాపారి పరార్

HYD: ఫిల్మ్‌నగర్ మాణిక్ జ్యువెలరీస్ యజమాని మాణిక్ చౌదరి ప్రజల నుంచి తాకట్టు పెట్టుకున్న నగలతో ఉడాయించాడు. వారం రోజులుగా షాప్ తెరవకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాణిక్ చౌదరి చిట్ ఫండ్, అప్పుల పేరుతో చాలా మంది నుంచి లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు. పోలీసులు నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.