కదిరి రైల్వే గేటు వద్ద భారీ ట్రాఫిక్ అంతరాయం

కదిరి రైల్వే గేటు వద్ద భారీ ట్రాఫిక్ అంతరాయం

సత్యసాయి: కదిరి పట్టణంలోని కౌలేపల్లి రైల్వే గేటు వద్ద ఆదివారం ఒక లారీ రోడ్డు మధ్య ఆగిపోవడంతో వాహనాల రాకపోకలు గంటల పాటు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వాహనదారులు సంబంధిత అధికారులను కోరారు.