నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
WGL: వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తరుణ్ తెలిపారు. ఈ సమయంలో ఇల్లంద, కట్ర్యాల, కడారిగూడెం, కుమ్మరిగూడెం, రాంధాన్ తండా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.