'IASF 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి'

NLG: దేవరకొండలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ ముఖ్య నాయకు సమావేశం సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరంలో ఏర్పడిన మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ చరిత్రలో నిలిచిందన్నారు. ఈనెల 12 నుంచి 31 వరకు జరిగే ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.