అవినీతికి కేరాఫ్ అడ్రస్ అమీన్పూర్ మున్సిపాలిటీ

SRD: పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ మున్సిపల్ అధికారులు పారిశుద్ద్యంపై ప్రాముఖ్యత ఇవ్వడం లేదని స్థానికులు వాపోయారు. మున్సిపల్ పరిధిలో చెత్త కుప్పలు పేరుకుపోవడం, మూగ జీవాలు ఆహారంగా తీసుకోవడంతో నోరులేని జీవాలు అనారోగ్య బారిన పడుతున్నాయని ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.